భారీ యగు యాగమునకు
ఆ రాముడు లక్ష్మణునితొ ఆటంకములన్
ఏ రీతి కలగ కుండగ
నారిని సారించి విల్లు నయముగ పట్టెన్ 13
మారీచ సుబాహు లనెడి
ఘోరపు రాక్షసులు వచ్చి గొడవను చేయన్
నేరుగ రాముని శరమును
దూరము మారీచుడు పడ , త్రుంచె సుబాహున్ 14
యాగము పూర్తయినది మీ
ఆగమనము సఫలమయ్యె అని కౌశికుడున్
వేగమె మిథిలకు చనెదము
యోగి జనకు చూడ మనకు యుక్తము నౌగా ! 15
ముని వెనుక రామలక్ష్మణు
లును చని నొక చోటునను విలోకించిరిగా
వనితయె రాయయు రాముడు
తన పాదము తగలగానె తడబడ నపుడున్ 16
అంతట విశ్వామిత్రుడు
కాంత అహల్య అనియు ,పతి గౌతముడనియున్
అంతక ముందటి ఘటనలు
సాంతముగా చెప్ప వారు చనిరి ముందుకున్ 17
విను రామ,పరశు రాముడు
జనకుని కిని శివధనస్సు సంబర పడగా
మునుపిచ్చె నని కౌశికుడున్
ఘనులెందరొ దాని కదప కష్టపడిరనెన్ 18
గాదిసుతు వెంట నిరువురు
సోదరులును మిథిల చేర చూసి జనకుడున్
సాదరముగ మర్యాధలు
మోదముతో చేసి పలికె ముని ముఖ్యునితో 19
పూజ్యులు మీ వెంటన ఈ
తేజోవంతులు ఎవ్వరనియు తెల్పుడు అనగా
ఓ జనక ! అయోధ్యఫురికి
రాజు దశరధుడవ, రామ లక్ష్మణులు సుతుల్ 20
వారెవరొ తెలిసియు జనకుడ
పారముగను సంతసించి ఆలోచించెన్
నారద ముని సూచించిన
కారణ జన్ములును వీరు కాబోలనియున్ 21
ఒక సారి సీత చెలులతొ
చకచక బంతులతొ నాడు సందర్భమునన్
ఒక బంతి శివ ధనసు కిం
దకి పోగా నతి సులువుగ దానిని జరిపెన్ 22
అది చూసి జనకు డప్పుడు
మదిలో నాశ్చర్యపడియు మా సీతకు నే
ముదముగ నెంచెద వరునిగ
అదరగ విల్లె క్కు పెట్టు ప్రతిభావంతున్ 23