రామ భరతులు కౌసల్య కైక రాణులకును
లక్ష్మణుండును శత్రుఘ్న లా సుమిత్ర
కును జనించిరి రాజును కూర్మి తోడ
చేర్చె సుతుల వశిష్ఠుని చెంత చదువ 05
రామ లక్ష్మణు లొక రొ క లంటి యుండ
భరత శత్రుఘ్ను లిరువురు పాము కుంటు
చదువులాటల మునిగియు చక్కగాను
పెరుగు చుండిరి వశిష్టు పెంపకమున 06
అంతట విశ్వామిత్రుడు
ఎంతయో వడిగా నడచుచు ఏతెంచె నటన్
చెంతకు దశరధుడు చనియు
సంతస మొందితిమనె తమ సాన్నిత్యముతో 07
ఏ విధి మీకును నాచే
కావలసిన కార్యమంచు కౌశికు నడఁగన్
చేవలె యజ్ఞము నేనును రావలె రామ ద్వయమును రక్షింప మమున్ 08