రామాయణ కావ్య కథను
సామాన్యుల కర్ధ మైన సరళపు భాషన్
ఓమారు రాయ దలచితి
రామా దయతలచి నన్ను రక్షించవయా 01
దశరథు డయోధ్యకు రాజై
కౌసల్య,సుమిత్ర కైక కాగా భార్యల్
పసి బిడ్డ లెవరు పుట్టక
వసుధీశుడు బాధపడుచు వసిష్టు నడిగెన్ 02
యాగము చేయుము రాజా
వేగమె కొడుకులు కలిగియు వేదన తీరున్
తేగలవు "ఋష్య శృంగుని "
కాగలదిది వసుధ పుత్ర కామేష్టిగయున్ 03
యాగపురుషుడు పాత్రతో పాయసమున
ఇచ్చె దశరథుని కాతడు ఇంపు తోడ
రాణు లయిన కౌసల్య కై కకును నివ్వ
వారు చెరిసగము సుమిత్ర వంతు నిడిరి 04